షూటింగ్‌ చేయనన్న కమల్‌.. లేఖ ద్వారా వివరణ ఇచ్చిన లైకా

కొద్ది రోజుల క్రితం భారతీయుడు 2 చిత్ర షూటింగ్‌లో ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో మనందరికి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులతో పాటు మరణించిన వారికి కమల్‌ హాసన్‌ కోటి రూపాయలు అందించారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలని ఆదుకోవాలని, భద్రతకి సంబంధించిన కొన్ని షరతులని అంగీకరిస్తేనే తాను షూటింగ్‌లో పాల్గొంటానంటూ కమల్‌ బహిరంగ లేఖ రాసారు. దీనిపై లైకా స్పందించింది.


షూటింగ్‌ సమయంలో జరిగిన క్రేన్‌ ప్రమాదంపై మేం తీవ్ర ఆందోళన చెందుతున్నాం. బాధిత కుటుంబాలకి మా సంస్థ తరపున అందుబాటులో ఉన్నాం. ఇప్పటికే ఆర్ధిక స్థాయంగా రూ.2 కోట్లు ప్రకటించాం. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నాం. ఫిబ్రవరి 22 కి ముందే ఈ నిర్ణయాలు తీసుకున్నాం. కాని అవి మీ దృష్టికి రాక లేఖ రాసారని మేం భావిస్తున్నాం. షూటింగ్‌ సమయంలో అన్ని రకాల భద్రత చర్యలు తీసుకున్నాం. ప్రొడక్షన్‌ భీమాతో పాటు వ్యక్తిగత భీమాలు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. బాధిత కుటుంబాలకి పూర్తి అండగా ఉంటాం. మీరు కోరినవన్నీ మేం ముందే చేశాం. సినిమా షూటింగ్‌ పునః ప్రారంభిస్తే బాగుటుందని మేం భావిస్తున్నాం అని లైకా బహిరంగ లేఖలో పేర్కొంది.