10 భాష‌ల్లో జేమ్స్ బాండ్ 25వ చిత్ర ట్రైల‌ర్


జేమ్స్ బాండ్ మూవీస్‌ని  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న‌ యాక్షన్ ప్రేమికులు ఎంత‌గా ఇష్ట‌ప‌డ‌తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు వ‌చ్చిన‌ 24 సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. ప్ర‌స్తుతం   ‘నో టైమ్‌ టూ డై’ పేరుతో జేమ్స్ బాండ్ 25వ చిత్రం రూపొందుతుంది.  డేనియల్ క్రేగ్ హీరోగా నటిస్తోన్న 5వ సినిమా. ఒక కేరెక్టర్‌తో 56 ఏళ్లు గా ప్రపంచ ప్రేక్షకులను అల‌రిస్తున్నాయి జేమ్స్ బాండ్ చిత్రాలు  .ఈ సిరీస్ తర్వాత జేమ్స్ బాండ్ సినిమాలకు డేనియల్ క్రేగ్ గుడ్‌బై చెప్పనున్నాడు. కారీజోజి పుకునా తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం నో టైమ్ టూ డై చిత్ర ట్రైల‌ర్ రేపు 10 భాష‌ల‌లో విడుద‌ల కానుంది. హిందీ, తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, గుజ‌రాతీ, మ‌రాఠీ, పంజాబీ, భోజ్‌పూరీ, బెంగాలీ, మ‌ల‌యాళీ భాష‌ల‌లో ట్రైల‌ర్ సంద‌డి చేయ‌నుంది. మూవీని ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల‌లో ఏప్రిల్ 2 న విడుద‌ల చేయ‌నున్నారు. కిడ్నాప్‌కు గురైన ఓ సైంటిస్ట్‌ను కాపాడేందుకు మళ్లీ జేమ్స్‌బాండ్‌ను ఉద్యోగంలోకి తీసుకొస్తారు. ఆ తర్వాత జరిగినే సంఘటనే ఈ సినిమా స్టోరీ అని  తెలుస్తుంది. ఈ సినిమాను మెట్రో గోల్డ్ విన్ మేయర్, ఇయోన్ ప్రొడక్షన్ సంయుక్తంగా తెరకెక్కించాయి.