ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఉన్న స్నేహ ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్‌లో నటిస్తూ మెప్పిస్తుంది. ఆ మధ్య వినయ విధేయ రామ చిత్రంలో రామ్‌చరణ్‌కి వదినగా నటించిన స్నేహ రీసెంట్‌గా వచ్చిన తమిళ చిత్రం పటాస్‌లో మెరిసింది. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగా 2012లో తమిళ నటుడు ప్రసన్నని వివాహం చేసుకుంది స్నేహ. ఆ తర్వాత సినిమాలు కాస్త తగ్గించింది. స్నేహ, ప్రసన్న దంపతులకి విహాన్ అనే కుమారుడు ఉండగా, రీసెంట్‌గా ఆడపిల్ల జన్మించింది. ఈ విషయాన్ని స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. శుక్రవారం( జనవరి 24) రోజు ఆడపిల్ల పుట్టడంతో తమ ఇంట్లోకి మహాలక్ష్మీ వచ్చిందని స్నేహ దంపతులు సంబరాలు చేసుకుంటున్నారు.
స్నేహ దంపతుల్లో ఆనందం.. మహాలక్ష్మీ పుట్టిందని సంబురాలు